Monday, April 29, 2024

వామ్మో, ఈ పిల్లి వేరే లెవ‌ల్‌.. తనలా పుష్​ అప్స్​ తీయగలరేమో ట్రై చేయండి! (వీడియో)

పెంపుడు జంతువులు అన్నా.. చిన్నారుల‌ చిలిపి చేష్ట‌ల‌న్నా చాలామంది లైక్ చేస్తారు. పెట్స్‌ని త‌మ సొంత బిడ్డ‌ల్లా పెంచుకుంటారు. అయితే ఎక్కువ‌గా శున‌కాల‌కు ఉన్న విశ్వాసం పెంపుడు జంతువుల్లో మ‌రే జంతువుకు, ప‌క్షుల‌కు ఉండ‌దు. కానీ కొంత‌మంది డిఫ‌రెంట్ టైప్ ఆఫ్ పెట్స్‌ని పెంచుకునేందుకు ఇష్ట‌ప‌డ‌తారు.

కొంత‌మంది అయితే వారి ఇళ్ల‌ల్లో పిల్లుల‌ను పెంచుకుంటారు. వారితో పాటే అవీ ఇంట్లో తిరుగుతూ, బెడ్‌పైనా దొర్లుతుంటాయి. ఇక వారు చేసే రోజువారీ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఎక్స‌ర్‌సైజులు, పుష్ అప్స్ వంటివి చూసి అట్లాగే పోజు కొడుతుంటాయి. ఇక్క‌డ ఉన్న ఈ పిల్లి వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. త‌న య‌జ‌మాని చేసే పుష‌ప్స్ మాదిరిగానే తాను జిమ్ ప్లేస్‌లో పుష‌ప్స్ తీయ‌డం ఫ‌న్నీగా ఉంది.. దీన్ని చూసి చాలామంది న‌వ్వుకుంటున్నారు. ఈ వీడియోని త‌న ట్వీట్ట‌ర్‌లో పోస్టు చేశారు నారాయ‌ణ‌పేట క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న‌.. పైగా దీనికి వీకెండ్ గోల్స్ అని ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చారు.

ఈ వీడియో కోసం..www.prabhanews.com లోని వీడియోస్ ట్యాబ్‌పై క్లిక్ చేసి చూడొచ్చు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement