Wednesday, May 8, 2024

ఢిల్లీలో థర్డ్ వేవ్ భయం.. ఎల్లో అలర్ట్ ప్రకటించే చాన్స్.. ప్రజా జీవనంపై మళ్లీ ఆంక్షలు..

ఢిల్లీలో కొవిడ్ పాజిటవ్ కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు (సోమవారం) వరుసగా రెండో రోజు 0.68 పర్సంటేజీతో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది కీలకమైన 0.5 శాతం మార్కు కంటే ఎక్కువగా ఉంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ఎల్లో అలర్ట్ ను ప్రకటించే చాన్స్ ఉంది. సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత.. దశలవారీగా షాపులు, ఆఫీసులతో పాటు చాలా కార్యకలాపాలు పునః ప్రారంభమయ్యాయి. మళ్లీ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ఎల్లో అలర్ట్ కనుక ప్రకటిస్తే మళ్లీ వ్యాపారాల కథ మొదటికి వస్తుందని చాలామంది అంటున్నారు.

ఢిల్లీ ప్రభుత్వం నాలుగు- దశల గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) ప్రకారం కొవిడ్ కేసుల పెరుగుదల ఆధారంగా థర్డ్ వేవ్ అంచనాతో జులైలోనే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దీనికి ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆమోదించింది. ఈ హెచ్చరికలతో చాలా మటుకు దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయాల్సి ఉంటుంది. అయితే దీనిపై నగర పాలక సంస్థ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఓపెన్ చేసేవి.. మూతపెట్టాల్సినవి..
1) పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు మూసివేయాలి. ప్రైవేట్ కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి పర్మిషన్ ఉంటుంది.
2) అవసరం లేని వస్తువులు, సేవలను విక్రయించే దుకాణాలు.. మాల్స్ బేసి-సరి నియమం ప్రకారం ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు.
3) నగరంలోని రెస్టారెంట్లు ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు 50 శాతం సామర్థ్యంతో పనిచేయొచ్చు. అయితే బార్‌లు మధ్యాహ్నం 12 నుండి రాత్రి 10 గంటల వరకు 50 శాతం సామర్థ్యంతో తెరిచి ఉంచడానికి చాన్స్ ఉంది.
4) ప్రస్తుతం ప్రేక్షకులను అనుమతిస్తున్న సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ లు మూసివేయాల్సి ఉంటుంది. అలాగే బాంకెట్ హాల్స్ , ఆడిటోరియంలు కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అయితే.. హోటళ్లు తెరిచి ఉంచడానికి అనుమతి ఉంది.
5) స్పాలు, జిమ్‌లు, యోగా ఇన్‌స్టిట్యూట్‌లు , ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు మూసివేయాల్సి ఉంటుంది. క్రీడా సముదాయాలు, స్టేడియాలు, స్విమ్మింగ్ పూల్‌లు కూడా క్లోజ్ చేయాలి. అయితే ఈ ప్రదేశాల్లో జాతీయ లేదా అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను నిర్వహించడంపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. పబ్లిక్ పార్కులు తెరిచి ఉంటాయి.
6) ఢిల్లీ మెట్రో 50శాతం సీటింగ్ సామర్థ్యంతో నడుస్తుంది. ప్రయాణికులు ఎవరూ లోపల నిలబడటానికి అనుమతించబడరు. అంతర్రాష్ట్ర బస్సులు 50 శాతం సీటింగ్‌తో నడుస్తాయి. ఆటోలు, -రిక్షాలు, టాక్సీలు, సైకిల్ రిక్షాలలో  కేవలం ఇద్దరు ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు.
7) సెలూన్లు, బ్యూటీ పార్లర్లు పనిచేయడానికి పర్మిషన్ ఉంటుంది.
8) వివాహాలు, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. 
9) సామాజిక, రాజకీయ, మత, పండుగలు ,  వినోద సంబంధిత కార్యకలాపాలపై నిషేధం ఉంటుంది. భక్తుల ప్రవేశంపై ఆంక్షలతో ప్రార్థనా స్థలాలు తెరిచి ఉంటాయి.
ఢిల్లీలో ఇప్పటివరకు 14,43,683 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి, 25,106 సంబంధిత మరణాలు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,289, అందులో 692 మంది రోగులు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఢిల్లీ రోజువారీ కేస్ లోడ్ ఈ రోజు (సోమవారం)  14శాతం పెరిగింది. ఎందుకంటే జాతీయ రాజధానిలో 331 కొత్త కేసులు - 6నెలల్లో అత్యధికంగా నమోదయ్యాయి. 
Advertisement

తాజా వార్తలు

Advertisement