Friday, May 3, 2024

కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇంటికి సాగ‌నంపాలి… సీఎం కేసీఆర్

కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇంటికి సాగ‌నంపాల‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. వికారాబాద్ జిల్లాలో నూత‌న క‌లెక్ట‌రేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ… వికారాబాద్, తాండూర్, చేవెళ్ల‌కు కృష్ణా నీళ్లు తెస్తామ‌న్నారు. వికారాబాద్ ప్రాంతానికి ప్ర‌త్యేక చ‌రిత్ర ఉంద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ‌, దేశ వ్యాప్తంగా అనంత‌గిరి కొండ‌ల‌కు ప్ర‌త్యేక పేరుంద‌న్నారు. ఇక్క‌డి టీవీ ద‌వాఖానా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింద‌న్నారు. రంగారెడ్డి జిల్లా కార్యాల‌యాలు వికారాబాద్‌లో పెట్టాల‌ని కోరారు.

తెలంగాణ వ‌స్తే భ‌గ‌వంతుని ద‌య వ‌ల్ల వికారాబాద్‌నే జిల్లా చేసుకుందామ‌ని చెప్పాను. చేశానన్నారు. అద్భుత‌మైన ప‌రిపాల‌న భ‌వ‌నం నిర్మించుకున్నామ‌న్నారు. ఇవాళ ఈ భ‌వ‌నాన్ని ప్రారంభించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. శుభాకాంక్షంలు, అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నానన్నారు. వికారాబాద్‌కు మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ మంజూరైందన్నారు. మీ ఊరికి పోయిన త‌ర్వాత మీ పెద‌ద్ద‌ల‌తో చ‌ర్చ పెట్టాలన్నారు. తెలంగాణ రాకుంటే వికారాబాద్ జిల్లా అయ్యేదా ? మెడిక‌ల్ కాలేజీ వ‌చ్చేదా ? డిగ్రీ కాలేజీ వ‌చ్చేదా ? అనే విష‌యాల‌పై ఆలోచించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement