Friday, April 19, 2024

మ‌రింత గ్లామ‌ర్ గా మ‌హేశ్ బాబు-ఫిట్ నెస్ ట్రైన‌ర్ లాయిడ్ స్టీవెన్స్ తో ఫొటో

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు గ్లామ‌ర్ గురించి అంద‌రికి తెలిసిందే. వ‌య‌సు పెరిగే కొద్దీ ఆయ‌న అందం కూడా పెరుగుతూనే ఉండ‌టం విశేషం. అయితే సినీ సెల‌బ్రిటీలు త‌మ గ్లామ‌ర్ ని కాపాడుకునేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డ‌తారు.ఇంకా ప‌లువురు హీరోలు సిక్స్ ప్యాక్ తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. వారు అలా సిక్స్ ప్యాక్ లు చేయడం వెనుక చాలా కృషి ఉంటుంది. ప్రత్యేక ఫిట్ నెస్ నిపుణుల పర్యవేక్షణలో కసరత్తులు చేస్తుంటారు. ఈ క్రమంలో హాలీవుడ్ నుంచి ట్రైనర్లను పిలిపించుకుంటారు. అలా హాలీవుడ్ నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలకు ట్రైనర్ గా వ్యవహరించిన వారిలో లాయిడ్ స్టీవెన్స్ ఒకరు. ఆయన గతంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి ఫిట్ నెస్ కోచ్ గా వ్యవహరించారు. తాజాగా సూప‌ర్ స్టార్ మహేష్ బాబుకు ట్రైనర్ గా వ్యవహరించనున్నారు అనే టాక్ వినిపిస్తుంది. అందుకు బలం చేకూర్చేలా లావిడ్ స్టీవెన్స్, మహేష్ బాబుతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లాయిడ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటోను షేర్ చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement