Tuesday, May 14, 2024

Breaking: బీజేపీకి, టీఆర్​ఎస్​కు ఒప్పందం​ ఉంది.. నల్ల చట్టాలకు సపోర్టు చేయడమే నిదర్శనం

పార్ల‌మెంట్‌లో ప్ర‌ధాని మోడీ మూడు న‌ల్ల‌చ‌ట్టాలు ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు దానికి మ‌ద్ద‌తుగా టీఆర్ ఎస్‌పార్టీ మ‌ద్ద‌తు తెలిపింది. బీజేపీకి తెలుసు తెలంగాణ‌లో నేరుగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే శ‌క్తి వారికి లేదు. అందుకోస‌మే బీజేపీ వారు కేంద్రంలో, ఢిల్లీలో ఉండి రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్క‌డ టీఆర్ ఎస్ పార్టీని న‌డ‌పాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

బీజేపీకి తెలుసు ఎప్పుడు కూడా ఈ భూ ప్ర‌పంచం ఉన్న వ‌ర‌కు కాంగ్రెస్, బీజేపీతోని పొత్తు, ఒప్పందం ఉండ‌దు. సంబంధం ఉండ‌ద‌ని, అందుకోస‌మే బీజేపీ వారు ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ ఏర్ప‌డొద్ద‌ని టీఆర్ ఎస్‌కు స‌పోర్టు చేస్తోంది. వారికి మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. వారి ఒప్పందంలో భాగ‌మే ఇది.

దీనికి సాక్ష్యం ఏంటంటే.. తెలంగాణ ప్ర‌భుత్వం ఎంత అవినీతి చేసినా కేంద్ర ప్ర‌భుత్వం ఈడీ ద్వారాగానీ, ఇత‌ర ద‌ర్యాప్తు సంస్థ‌ల ద్వార గానీ విచార‌ణ జ‌ర‌ప‌డం లేదు. అదే వారి మ‌ధ్య ఒప్పందానికి నిద‌ర్శ‌నం. అన్నారు కాంగ్రెస్​ అధినేత రాహుల్​ గాంధీ

Advertisement

తాజా వార్తలు

Advertisement