Tuesday, May 14, 2024

Breaking: ఉంటే ఉండండి పోతే పోండి.. కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు సీరియ‌స్ వార్నింగ్‌!

టీఆర్ ఎస్‌తో కానీ, బీజేపీతో కానీ ములాఖ‌త్ అయిన లీడ‌ర్లు ఎవ‌రైనా ఉంటే ఆ పార్టీలోకి వెళ్లొచ్చు. కాంగ్రెస్‌లో ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వారి ప‌నితీరుతోనే టికెట్లు ఇస్తాం. ప్ర‌జ‌ల్లో ఉండి సేవ చేసే వ్య‌క్తుల‌కు మాత్ర‌మే టికెట్లు ఇస్తాం. అని వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ స‌భ వేదిక‌గా పార్టీలో అంత‌ర్గ‌త గొడ‌వ‌లు సృష్టించే వారికి సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు రాహుల్ గాంధీ.

సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన‌ప్పుడు దాని వెన‌కాల ఒక బ‌ల‌మైన క‌ల ఉండేది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే వారు క‌న్న క‌ల‌, వారితోపాటు మీరంద‌రు క‌న్న క‌ల మీతో పాటు నేను కూడా క‌ల‌.. నెర‌వేర‌డానికి, మీతో పాటు ప్ర‌యాణం చేసి ఆ క‌ల‌ను నిజం చేస్తాన‌ని ప్ర‌మాణం చేసి చెబుతున్నా అన్నారు రాహుల్ గాంధీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement