Monday, May 6, 2024

మంత్రిని పొగిడిన చిన్నారి – స‌మాధాన‌మిచ్చిన కేటీఆర్

మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ లో చాలా యాక్టీవ్ గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఓ చిన్నారి కేటీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించాడు. ఖాజాగూడ లేక్ రోడ్ హైద‌రాబాద్ హైటెక్ ను చూపిస్తోంద‌ని ఆనందం వ్య‌క్తం చేశాడు. ఈ లేక్‌ను అభివృద్ధి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకున్న మంత్రి కేటీఆర్‌కు త‌నీష్ అనే పిల్లాడు.. ట్విట్ట‌ర్ వేదిక‌గా థాంక్యూ చెప్పాడు. వీకెండ్ సాయంత్రాల్లో ఈ రోడ్‌పై వాహ‌నాల‌ను నిషేధిస్తే.. పిల్ల‌లు ఫ్రీగా వాకింగ్ చేసుకుంటార‌ని త‌నీష్ కేటీఆర్‌ను అభ్య‌ర్థించాడు. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. హేయ్ త‌నీష్‌.. నీ మంచి మాట‌ల‌కు థాంక్స్ అని కేటీఆర్ తెలిపారు. కుటుంబాలు, పిల్ల‌ల కోసం ఆ రోడ్‌తో పాటు చెరువును కూడా మ‌రింత అందంగా తీర్చిదిద్దాల‌నుకుంటున్నామ‌న్నారు. ఈ ప‌నుల‌పై అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని, వీకెండ్స్‌లో ఏదైనా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌కు స‌న్నాహాలు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement