Tuesday, May 7, 2024

Big Breaking | చేతిలో సుత్తి, కారుతున్న రక్తం.. లియో ఫస్ట్​ లుక్​ మామూలుగా లేదు!

కోలీవుడ్​ స్టార్​ హీరో తలపతి విజయ్ ఇవ్వాల తన 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అతని పుట్టినరోజు సందర్భంగా అతని రాబోయే సినిమా లియో గురించి మేకర్స్ అర్ధరాత్రి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన సోషల్ మీడియా అకౌంట్స్​లో ఈ పోస్టర్‌ను షేర్​ చేశారు. కాగా, పోస్టర్​లో హీరో ఒకరి తలను సుత్తితో పగలగొట్టడం,  రక్తం గాలిలో తేలుతున్నట్టు ఉంది. పోస్ట్ లో అతను హీరో విజయ్​కి శుభాకాంక్షలు తెలుపుతూ ‘‘హ్యాపీ బర్త్‌డే @ యాక్టర్​ విజయ్ అన్నా! మళ్లీ మీతో చేతులు కలపడం ఆనందంగా ఉంది”  అని వెల్లడించారు.

లియో మూవీ ఏంటంటే..

ఈ సినిమాకి ముందుగా తాత్కాలికంగా తలపతి 67 అని పేరు పెట్టారు. ఎందుకంటే ఇది హీరో విజయ్​కి 67వ చిత్రం కావడం విషేశం. ఈ చిత్రం కోసం విజయ్ గ్రే-షేడెడ్ హెయిర్‌స్టైల్‌ను మెయింటేన్​ చేస్తున్నాడు. ఇక ఈ విధమైన లుక్​ రావడానికి దాదాపు 30 రకాలుగా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ మేకోవర్​ని ఫైనల్​గా ఎంపిక చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ దత్, త్రిష, అర్జున్ సర్జా, మిస్కిన్, ప్రియా ఆనంద్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి లోకేశ్ సహ రచయితగా కూడా ఉన్నారు. సంగీతం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చారు. ఈ ఏడాది అక్టోబర్ 19న ఈ మూవీ థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement