Sunday, May 5, 2024

గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు … 31 మంది సజీదహనం

చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రెస్టారెంట్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి 31 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.

నార్త్‌వెస్ట్రన్‌ నగరం ఇంచువాన్‌లో బుధవారం రాత్రి ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న రెస్టారెంట్‌.. జనాలతో కిక్కిరిసిపోయిన టైంలో రెస్టారెంట్‌లోని గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయ్యి.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడడంతో 31 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరికొందరు గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక బృందాలు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేసే యత్నం చేశాయి. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగ్గా.. గురువారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో మంటలు పూర్తిగా చల్లారాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement