Sunday, May 5, 2024

Breaking: హేమంత్​ సోరేన్​ శాసన సభ్యత్వం రద్దు.. ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్​

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాస‌న స‌భ్య‌త్వం శుక్ర‌వారం ర‌ద్దయ్యింది. ఈ మేర‌కు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ర‌మేశ్ బ‌యాస్ శుక్ర‌వారం సోరెన్ శాస‌న స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ఉత్త‌ర్వుల విడుద‌ల‌తో ఈ క్ష‌ణం నుంచే హేమంత్ సోరెన్ స‌భ్య‌త్వం ర‌ద్దయిపోయిన‌ట్లేనని ప్రకటించారు. త‌న‌కు తానుగా గ‌నులను కేటాయించుకున్న హేమంత్ సోరెన్‌పై విమ‌ర్శ‌ల వెల్లువ కురిసిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో హేమంత్ వ్య‌వ‌హార స‌ర‌ళిపై కేంద్ర ప్ర‌భుత్వానికి గవర్నర్ ఫిర్యాదు చేయ‌డం, ఆ ఫిర్యాదును కేంద్రం… ఎన్నిక‌ల సంఘానికి పంపడం, హేమంత్ శాస‌న స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దుకు ఈసీ సిఫార‌సు చేయ‌డం వరుసగా జరిగిపోయాయి. కాగా, ఈసీ సిఫార‌సు ఆధారంగా హేమంత్ ఎమ్మెల్యే పదవిని ర‌ద్దు చేస్తూ గ‌వ‌ర్న‌ర్ నిర్ణయం తీసుకోవ‌డం వేగంగా జరిగింది.. ఈ కీల‌క ప‌రిణామం త‌ర్వాత త‌న ప్ర‌భుత్వాన్ని కాపాడుకునేందుకు హేమంత్ సోరెన్ ఎలాంటి అడుగు వేస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement