Thursday, May 2, 2024

క‌ల‌ర్ ఫుల్ గా రంగ రంగ వైభ‌వంగా టైటిల్ సాంగ్ లిరిక‌ల్ వీడియో

గిరీసాయ తెర‌కెక్కిస్తోన్న చిత్రం రంగ రంగ వైభ‌వంగా.ఈ చిత్రం నుండి టైటిల్ సాంగ్ లిరిక‌ల్ వీడియో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో వైష్ణ‌వ్ తేజ్ , కేతిక శ‌ర్మ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కాగా మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా టైటిల్ సాంగ్ లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేశారు. సెల‌బ్రేషన్ మూడ్‌లో క‌ల‌ర్‌ఫుల్‌గా సాగుతున్న వెడ్డింగ్ టైటిక్ ట్రాక్ మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను ఆక‌ట్టుకుంటోంది. రోల్ రైడా రాసిన ఈ పాట‌ను సాగ‌ర్, శ్రీనిష జే పాడారు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ తెర‌కెక్కిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 2న థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement