Friday, May 3, 2024

Vaccination: తెలంగాణ మరో మైలురాయి.. 4 కోట్ల మందికి వ్యాక్సిన్లు!

కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తెలంగాణ కీలక మైలురాయిని చేరుకుంది. రాష్ట్రంలో 4 కోట్ల మందికి డోసుల వ్యాక్సిన్ అందించారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారికి 94 శాతం మొదటి డోసు పూర్తి కాగా.. 50 శాతం మందికి సెకండ్ డోస్ అందించారు. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ టీకా గణాంకాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,00,45,178 మందికి కరోనా వ్యాక్సిన్ డోసలు అందించారు. 2,61,09,999 మందికి మొదటి డోసు పూర్తికాగా.. 1,39,35,179 మందికి రెండో డోసుల వ్యాక్సిన్ పూర్తయింది. ఈ ఘనత సాధించినందుకు వైద్య సిబ్బందికి సీఎస్ అభినందనలు తెలిపారు. వచ్చెనెలలో మరో కోటి డోసులు పూర్తి చేస్తామని వెల్లడించారు.

కాగా, దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అందులో భాగంగా ‘హర్ ఘర్ కీ దస్తక్’ అనే కార్యక్రమం ద్వారా ప్రతీ ఇంటికి వెళ్లి స్వయంగా వ్యాక్సిన్లను అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement