Sunday, May 5, 2024

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ విచారణకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ హాజరయ్యారు. కరోనా కట్టడికి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నామని, కర్ఫ్యూ మూలంగా రాష్ట్రంలో కేసులు భారీగా తగ్గాయని కోర్టుకు రిజ్వీ తెలిపారు. దీంతో ప్రభుత్వం సమర్పించిన నివేదికపై కోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. కర్ఫ్యూ విధించాక రాష్ట్రంలో కేసులు ఎక్కడ తగ్గాయో చూపించాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. బార్లు, థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. అంతేగాకుండా.. కుంభమేళా వెళ్లినవారిని ఇతర రాష్ట్రాలు క్వారంటైన్‌లో పెడుతున్నారని, మరి వారిపట్ల తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని అడిగారు.

రాష్ట్ర సరిహద్దుల్లో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలుపాలని సూచించింది. ఎన్నికల నేపథ్యంలో ర్యాలీలు, సభలను ఎందుకు నియంత్రణ చేయడం లేదని, ఇతర దేశాల నుంచి వచ్చేవారిని ఆర్టీపీసీఆర్ టెస్టు ఎందుకు అడగడం లేదని మండిపడింది. RTPCR టెస్టు రిపోర్టు ఎందుకు 24 గంటల్లోపు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. వీఐపీలకు 24 గంటల్లోపే ఎందుకు ఇస్తున్న ప్రభుత్వం అడిగింది. రాష్ట్రంలో వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని, మూడు రోజుల్లోనే ఆక్సిజన్ కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నల వర్షం కురిపించింది. దీనికి ప్రభుత్వం సమర్పించిన నివేదికను పరిశీలించిన కోర్టు పూర్తి అసహనం వ్యక్తం చేసింది. దీంతో తదుపరి విచారణ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement