Thursday, December 9, 2021

కరోనా ఇంకా పోలేదు.. జాగ్రత్తలు పాటించండి: తెలంగాణ ఆరోగ్యశాఖ

తెలంగాణ కరోనా కేసులపై రాష్ట్ర వైద్య శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గత మూడు నెలల నుండి తగ్గుముఖం పట్టిందని… రికవరీ రేటు చాలా పెరిగిందని పేర్కొంది. నార్మల్ లైఫ్ లోకి వస్తున్నామని… ప్రస్తుతం పండగ సీజన్ మొదలైంది. రానున్న మూడు నెలలు పండగ సీజన్ అని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడని వారు… ఇప్పుడు జాగ్రతలు పాటించకపోతే కరోనాకు బలి అవుతారని హెచ్చరించింది.

ఇటీవల 17 ఏళ్ల అమ్మాయి కరోనా బారిన పడి చనిపోయిందని… ఇంకా కరోనా మొత్తం పోలేదు…జాగ్రతలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది. పండగలు, విందులు, షాపింగ్ చేసేటప్పుడు జాగ్రతలు తప్పనిసరి అని వెల్లడించింది. ఫ్యామిలీలో ఒకరు కరోనా బారిన పడితే మిగతా అందరూ కరోనా బారిన పడుతున్నారని… ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని… కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచనలు చేసింది. పండగ సీజన్ కాబట్టి…అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని హెచ్చరించింది. డిసెంబర్ వరకు మరింత జాగ్రతలు తప్పనిసరి అని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. రెండు డోసులు తీసుకుంటేనే సురక్షితమని ఆరోగ్యశాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News