Tuesday, October 26, 2021

హుజురాబాద్ ఉపఎన్నిక: 18 మంది నామినేషన్లు తిరస్కరణ

హుజూరాబాద్ ఉపఎన్నిక దగ్గర పడుతోంది. ఇప్పటికే పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల నుంచే కాకుండా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 8 వరకే నామినేషన్ల గడువు ముగిసింది. దాదాపు 61 మంది 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ముందు జాగ్రత్తగా కొంతమంది రెండు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల స్క్రూటినీ సందర్భంగా అధికారులు ప్రతి నామినేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు వచ్చిన నామినేషన్లను మాత్రమే గుర్తించారు. సక్రమంగా లేని నామినేషన్లను రిజెక్ట్ చేయనున్నారు.

ప్రస్తుతం అధికారులు 61 నామినేషన్లలో 18 నామినేషన్లను రిజెక్ట్  చేశారు. దీంతో హుజూరాబాద్ బైపోల్ బరిలో 43 మంది ఉన్నారు. ఈనెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ సమయంలోగా ఎంత మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారో అదే రోజు తెలియనుంది. హుజూరాబాద్ ఉపఎన్నిక పోరులో చివరకు ఎంతమంది నిలబడతారో ఈనెల 13వ తేదీ సాయంత్రానికి స్పష్టత రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News