Sunday, May 5, 2024

మళ్లీ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించే అవకాశం

తెలంగాణలో కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుంది. 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులను పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినట్లు సమాచారం. దీంతో ఆ తరగతుల వారిని ప్రమోట్ చేసే అవకాశం ఉండగా, విద్యార్థులకు సెలవులు ఇచ్చే యోచనలో ఉంది. ఆన్‌లైన్‌లో క్లాసులు కొనసాగించేలా ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మంగళవారం ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరోవైపు తెలంగాణలో పలు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలలోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. విద్యార్థులకే కాకుండా పలు చోట్ల లెక్చరర్లు, ఉపాధ్యాయులు కూడా కరోనా బారిన పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు కూడా భయాందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement