Sunday, April 28, 2024

మంచు విష్ణుతో స‌న్నీలియోన్ రొమాన్స్‌.. ఎన్ఆర్ఐ పాత్ర‌లో ఏం చేస్తుందంటే..

బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న పోర్న్ స్టార్‌ సన్నీ లియోన్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. 2017లో రాజశేఖర్ హీరోగా నటించిన “పిఎస్వి గరుడ వేగా” సినిమాలో డియో డియో డిస్స‌క.. డిస్స‌క అంటూ ఐటమ్ సాంగ్ లో అంద‌రినీ అల‌రించింది. తన డాన్స్ తో ప్రేక్ష‌ల‌ను అదోలోకంలోకి తీసుకెళ్లింది. లేటెస్ట్‌గా ఇప్పుడు మంచు విష్ణు, పాయల్ రాజపుత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “గాలి నాగేశ్వర రావుష‌ సినిమాలో మరో హీరోయిన్ పాత్రలో కనిపించనుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించిన కోన వెంకట్ సినిమా గురించి అందులోని పాత్రల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

సన్నీ లియోన్ ఈ సినిమాలో ఒక ఎన్ ఆర్ ఐ అమ్మాయిగా కనిపించనుందట. రేణుక అనే ఒక ఎన్నారై పాత్రలో సన్నీ ఈ సినిమాలో దేశంలోని ఒక పల్లెటూరుకి వచ్చి విష్ణు, పాయల్ లకు మంచి స్నేహితురాలు అవుతుందని, వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ లో సన్నీ లియోన్ పాల్గొంది. సినిమాకి సంబంధించి చాలా వరకు షూటింగ్ తిరుపతి దగ్గర రంగంపేటలో జరిగింది. ఇషాన్ సూర్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement