Monday, May 6, 2024

షూటింగ్ లో గాయ‌ప‌డిన విశాల్ – చికిత్స కోసం కేర‌ళ‌కి ప‌య‌నం

లాఠీ సినిమా షూటింగ్ లో గాయ‌ప‌డ్డాడు త‌మిళ హీరో విశాల్. ఆయ‌న చేతికి స్వ‌ల్పంగా గాయ‌మ‌యింది. ఓ బాలుడిని ర‌క్షించే సీన్ తీస్తుండ‌గా ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంద‌ట‌. చిన్నారిని పట్టుకుని కిందికి దూకుతుండ‌గా చేతి ఎముకకు గాయమైనట్టు విశాల్ ట్వీట్ చేసిన వీడియోలో కనిపిస్తోంది. ఈ చిత్రంలో విశాల్ పోలీస్ అధికారిగా కనిపించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను ఎ.వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. రమణ, నంద నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సునయన హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా, ఫైట్‌ సీన్ చిత్రీకరిస్తుండగా స్వల్పంగా గాయపడినట్టు పేర్కొన్న విశాల్.. చికిత్స, విశ్రాంతి కోసం కేరళ వెళ్తున్నట్టు తెలిపారు. మార్చి తొలి వారంలో తిరిగి తుది షెడ్యూల్‌లో పాల్గొంటానని విశాల్ వెల్ల‌డించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement