Friday, April 26, 2024

వాలెంటైన్స్ డే కి స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌నున్న ‘రాధేశ్యామ్’

రొమాంటిక్ లవ్ స్టోరీగా తెర‌కెక్కుతోంది రాధేశ్యామ్ చిత్రం. ఈ చిత్రంలో హీరోగా ప్ర‌భాస్, హీరోయిన్ గా పూజాహెగ్డే న‌టిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. దాంతో మళ్లీ ప్రమోషన్స్ కోసం ఈ సినిమా టీమ్ రంగంలోకి దిగిపోయింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమా నుంచి స్పెషల్ అప్ డేట్ రానుంద‌ట‌. ప్రపంచ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్పెషల్ వీడియో వదులుతారా? ఏదైనా సాంగ్ రిలీజ్ చేస్తారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. దాదాపు విదేశాల్లోనే నడిచే ఈ ప్రేమకథలో కృష్ణంరాజు .. భాగ్యశ్రీ .. జగపతిబాబు .. సత్యరాజ్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement