Sunday, May 19, 2024

Story : ఉద్యోగం వ‌దిలి.. ఎంబీఏ ఫుడ్ వాలీ పేరుతో స్టాల్

ఎంబిఏ చ‌దివిన ఓ యువ‌తి చాట్ బండార్ పెట్టింది. హ్యూమన్ రిసోర్సెస్‌లో ఎంబీఏ చేసిన ఓ మహిళ స్కూటర్‌పై ఫుడ్‌స్టాల్‌ను ఏర్పాటు చేసి అందరి దృష్టి ఆకర్షించింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ లోని సిల్గురిలో ఎంబీఏ ఫుడ్ వాలీ పేరుతో ఓ మహిళ ఈ స్టాల్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ఆమె పేరు ఫాతిమా కాగా… ఉత్తరప్రదేశ్ కి చెందిన మహిళ. పెళ్లి తర్వాత ఆమె సిలిగురికి వెళ్లింది. ప్రస్తుతం ఆమె జిల్లాలోని మతిగర ప్రాంతంలో నివసిస్తున్నారు. గత వారం బఘజతిన్ పార్క్ సమీపంలో వ్యాపారం చేయడానికి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు.ఫాతిమా తనకున్న స్కూటర్‌లో ఫుడ్ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఆమె స్టాల్ ప్రతిరోజూ రాత్రి 7 నుండి రాత్రి 10:30 వరకు పని చేస్తుంది. ఆమె తన స్టాల్‌లో ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని విక్రయిస్తుంది, ఆమె స్వయంగా వండుతుంది, సంపూర్ణ పరిశుభ్రతను పాటిస్తూ.. వాటిని అమ్మడం విశేషం.

ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి మహిళకు వారి స్వంత గుర్తింపు ఉండాలి. నేను ఉద్యోగం చేసేదానిని, కానీ ఆ తర్వాత నా కుటుంబానికి సమయం దొరకడం లేదు. అందుకే నా కుటుంబాన్ని చూసుకోవడం కోసం ఉద్యోగం వదిలి ఇప్పుడు నేను ఈ వ్యాపారాన్ని చేస్తున్నాను. నేను 2011లో MBA చేశాను. నా స్టాల్‌లో మీకు ఇంట్లో తయారుచేసిన అన్ని ఆహారాలు లభిస్తాయి. ఇవన్నీ 100 శాతం పరిశుభ్రతను పాటించడం ద్వారా తయారు చేశాను అని చెప్పడం విశేషం. ఖీర్, దహీ వడ, గోల్గప్పా , చాట్ వంటి వస్తువులు ఆమె స్టాల్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రజల డిమాండ్‌ను బట్టి ఫాతిమా తన ఆహార పదార్థాలను మార్చుకుంటుంది. ఈ వస్తువులను ఆమె స్వయంగా వండి విక్రయిస్తుంది. ఒక ప్లేట్ దహీ వడ ధర రూ. 25, గోల్గప్ప చాట్ రూ. 25, ఖీర్ ధర రూ. 20.కాగా త‌న‌కు వంట చేయడంలో నైపుణ్యం ఉందని చెప్పింది. నాకు రుచికరమైన ఆహారం ఎలా చేయాలో తెలుసు. అందుకే నేను దీన్ని చేస్తున్నాన‌ని ఆమె చెప్పడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement