Sunday, May 5, 2024

రెండో రోజు లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్స్

వ‌రుస‌గా రెండో రోజు లాభాల్లో ముగిశాయి స్టాక్ మార్కెట్స్. అంత‌ర్జాతీయ మార్కెట్ లో నెల‌కొన్న సానుకూల‌త‌లు , ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్ ని బ‌ల‌ప‌రిచాయి. కాగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు వివిధ ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. ఇది కూడా మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 657 పాయింట్లు లాభపడి 58,466కి చేరుకుంది. నిఫ్టీ 197 పాయింట్లు పుంజుకుని 17,463 వద్ద స్థిరపడింది. మారుతి సుజుకి (4.14%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.02%), హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ (2.50%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.77%), టైటాన్ (1.72%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. సన్ ఫార్మా (-0.72%), ఐటీసీ (-0.50%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.38%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement