Saturday, May 18, 2024

నేటి వన్డే మ్యాచ్ తో విరాట్ కోహ్లీకి మ‌రో అరుదైన‌ రికార్డు..

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. నేడు (బుధవారం) వెస్టిండీస్ – భారత్ మధ్య రెండో వన్డే మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతుండడం తెలిసిందే. అయితే, స్వదేశంలో కోహ్లీకి ఇది నూరవ (100) వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ అవుతుంది. స్వదేశంలో 100 ఓడీలు ఆడిన ఆటగాళ్ల‌లో ఇప్పటి వరకు సచిన్ టెండుల్కర్, మహమ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్.. ఈ న‌లుగురు ఆటడాళ్లు ఉండ‌గా ఇప్పుడీ క్ల‌బ్ లో విరాట్ కోహ్లీ కూడా స్థానం ద‌క్కించుకున్నాడు

విరాట్ కోహ్లీ తన కెరీర్ లో ఇప్పటి వరకు 258 వ‌న్ డే మ్యాచ్ లు ఆడాడు. మొత్తం 12,200 పరుగులు చేశాడు. దేశీయంగా 99 ఓడీలు ఆడగా, 5002 పరుగులు చేశాడు. దేశీయంగా 19 సెంచరీలు బాదాడు. విరాట్ కోహ్లీ కంటే బ్యాటింగ్ లో మెరుగైన రికార్డు గతంలో ఒక్క సచిన్ కే ఉంది. సచిన్ టెండుల్కర్ దేశీయంగా 164 ఓడీలు ఆడి, 6,976 పరుగులు రాబట్టుకున్నాడు. సచిన్ దేశీయంగా 20 శతకాలు సాధించాడు. బుధవారం మ్యాచ్ లో కోహ్లీ 100 పరుగులు సాధిస్తే కనుక సచిన్ తో సమానం అవుతాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement