Saturday, April 27, 2024

47కి పైగా దేశాల్లో ఒమిక్రాన్ .. మ‌ర‌ణించిన దాఖ‌లాలు లేవ్ ..

ప్ర‌స్తుతం ప్ర‌పంచం అంతా ఒమిక్రాన్ పేరు వింటే హ‌డ‌లిపోతుంది. ఈ కొత్త వేరియంట్ దావాల‌నంలా వ్యాపిస్తోంది. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్షిణాఫ్రికా, సెనెగ‌ల్, బోట్స్ వానా,మెక్సికో, భార‌త్, నెద‌ర్లాండ్స్ , హాంకాంగ్, ఇజ్రాయోల్, బెల్జియం, బ్రిట‌న్ , జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఆస్ట్రియా, కెనడా, స్వీడన్, స్విట్జర్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, జపాన్, ఫ్రాన్స్, ఘనా , దక్షిణ కొరియా, నైజీరియా, బ్రెజిల్, నార్వే, అమెరికా, సౌదీ అరేబియా, ఐర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రష్యా, నమీబియా, నేపాల్, థాయిలాండ్, క్రొయేషియా, అర్జెంటీనా, శ్రీలంక, మలేషియాతో పాటు సింగపూర్ దేశాల్లో న‌మోద‌య్యాయి.

ఒమిక్రాన్ వేరియంట్ యొక్క స్పైక్ ప్రొటీన్‌లో వైరస్ వ్యాప్తిని పెంచే ఉత్పరివర్తనలు అధికంగా ఉన్నాయ‌ని సైంటిస్టులు తెలిపారు. దీని కార‌ణంగా ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉంటుంద‌ని ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని హెచ్చ‌రించారు. అలాగే, ప్ర‌స్తుతం ఉన్న టీకాలను సైతం ఒమిక్రాన్ ఎదుర్కొని నిల‌బ‌డ‌గ‌లిగే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని ప‌లువురు శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. మ‌రికొంత మంది ప‌రిశోధ‌కులు ఒమిక్రాన్‌పై టీకాల ప్ర‌భావం గురించి రీసెర్చ్ చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 47కుపైగా దేశాల‌కు ఒమిక్రాన్ వ్యాపించింది. అయితే, దీని బారిన‌ప‌డి ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ చ‌నిపోలేద‌ని రిపోర్టులు తెలిపాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement