Wednesday, May 8, 2024

రెక్క‌ల చివ‌ర్లో చాక్లెట్ రంగు.. ఇదో కొత్త ర‌కం సీతాకోకచిలుక..

సీతాకోకచిలుకలంటే అందరికీ చాలా ఇష్టం.. గుంపులు గుంపులుగా వచ్చి అలా ఎగిరిపోతుంటే చూడ్డానికి ఎంతో హ్యాపీగా ఉంటుంది. అయితే వీటి లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గొంగలి పురుగు తన జీవన క్రమంలో సీతాకోక చిలుకగా మారుతుంది. అది గుడ్ల దశ నుంచి లార్వాగా.. ఆ తర్వాత ప్యూపా దశలో చెట్టుకు వేలాడుతూ.. దాని తర్వాత అందమైన సీతాకోకచిలుకగా మారుతుంది. కానీ, చాలామంది సీతాకోకచిలుకలను లైక్ చేస్తారు.. కానీ, గొంగలి పురుగులను మాత్రం చంపేస్తుంటారు. మరి గొంగలి పురుగులను చంపేస్తే సీతాకోకచిలుక ఎలా వస్తుందనేది మాత్రం ఎవరూ గుర్తించరు.. కాగా, ఈ మధ్య కొత్తరకం సీతాకోకచిలుకను కనుగొన్నారు.

చాక్లెట్ రంగు బార్డ‌ర్ ఉన్న కొత్త ర‌కం సీతాకోకచిలుకను సిక్కిం రాష్ట్రంలో క‌నుగొన్నారు. దీని పేరు చాక్లెట్ బార్డ‌ర్డ్ ఫ్లిట్ట‌ర్‌. బంగారు ప‌సుపు వ‌ర్ణంలో ఉండే ఈ సీతాకోక చిలుక‌ల‌ను ఉత్త‌ర సిక్కింలోని జోంగులో గుర్తించారు. రెక్క‌ల చివ‌ర్లో చాక్లెట్ రంగు ఉండ‌టంతో వీటికా చాక్లెట్ బార్డ‌ర్డ్ ఫ్లిట్ట‌ర్ పేరు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement