Sunday, April 28, 2024

అప్లాయిగుంటలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు : అశోక్ కుమార్

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్) : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న అప్లాయిగుంట గ్రామంలో వెలసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంకు దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన అప్లాయిగుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో త్వరలో కళ్యాణ కట్ట ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మూడున్నర కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఈ నెలలో ప్రారంభించేందుకు చైర్మన్ తో మాట్లాడతానని వివరించారు. అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది వర్షానికి ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే లోకల్ టెంపుల్స్ లో టీటీడీ చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి మెట్టు పనులు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కపిల్ తీర్థం వద్ద పడిన మండపం పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జరుగుతున్న బంగారం తాపడం పనులు త్వరలో పూర్తవుతాయని, అదేవిధంగా కోదండరామస్వామి ఆలయంలో వెండి వాకిలి పనులు త్వరలో ప్రారంభిస్తామని ఆయన మీడియాతో తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement