Tuesday, April 30, 2024

జాకెట్లు కట్​ చేసిన పోలీసులు… ఎగ్జామ్​ సెంటర్​లోకి పొడవాటి చేతుల దుస్తులతో రానివ్వట్లే!

ఇంటర్​ ఎగ్జామ్స్​ రాస్తున్న అమ్మాయిలు చాలామంది చీటీలతో చీటింగ్​ చేస్తున్నారని రాజస్థాన్​ పోలీసులు సీరియస్​ యాక్షన్​ తీసుకున్నారు. చీటింగ్​కు పాల్పడకుండా పొడవాటి చేతులున్న దుస్తులను స్లీవ్స్​గా కట్​ చేశారు.  కాగా, రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ పరీక్షకు హాజరవుతున్న గర్ల్స్​దుస్తులను కత్తెరతో స్లీవ్స్ వరకు​ తొలగించారు. కత్తెరతో ఎగ్జామ్​కు వచ్చిన వారి జాకెట్​ల చేతులను కట్​ చేయడంతో..  చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు.. అయినా నిండు చేతుల దుస్తులు ధరించిన బాలికలపై పరీక్షా కేంద్రాల బయట భద్రత కల్పించారు.

కాగా, చాలా మంది అమ్మాయిలు తమ దుస్తులను కత్తిరించడం చూసికన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో పాటు పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన వివాహితలు తమ వద్ద ఉన్న గొలుసులు, ఇతర నగలను తొలగించాలని పోలీసులు కోరారు. అంతేగాకుండా నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులని కేంద్రంలోకి అనుమతించలేదు. ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిన ఓ అమ్మాయి కాస్త ఆలస్యంగా వచ్చినందుకు అధికారులు ఆమెను పరీక్షకు రానివ్వకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. భరత్‌పూర్ జిల్లాలో 3,000 మంది అభ్యర్థులు పరీక్ష రాయడానికి వచ్చారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద భద్రత ఉంది. పరీక్ష ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నాం అని ASP అనిల్ మీనా చెప్పారు.

అంతేకాకుండా బాయ్స్​, గర్ల్స్​ స్టూడెంట్స్​ హాఫ్ స్లీవ్ టీషర్ట్, షర్ట్, సూట్, చీర ధరించి రావాలని, వెంట్రుకలకు సాధారణ రబ్బరు బ్యాండ్ ఉపయోగించాలని ప్రభుత్వం గతంలో మార్గదర్శకాలను జారీ చేసింది. అభ్యర్థులు తమ మొబైల్ ఫోన్‌లను పరీక్షా కేంద్రం లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతించబోమని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలోకి చైన్లు, ఉంగరాలు, చెవిపోగులు లేదా లాకెట్లు తీసుకురావొద్దని ప్రభుత్వం నిబంధనల్లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement