Saturday, May 4, 2024

‘నెట్ ప్లిక్స్’ లో శ్యామ్ సింగ‌రాయ్ – ఎప్పుడంటే

ఈ మ‌ధ్య‌కాలంలో ప‌లు సినిమాలు ఓటీటీ బాట ప‌డుతున్నాయి. రీసెంట్ గా థియేట‌ర్ లో రిలీజ్ అయిన చిత్రం శ్యామ్ సింగ‌రాయ్. ఈ చిత్రంలో హీరో నాని, సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి న‌టించారు. బెంగాల్ నేప‌థ్యంలో ఉన్న క‌థ‌ను తెర‌పై ఆవిష్క‌రించారు. సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. డైరెక్ట‌ర్ రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌ లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. కాగా.. శ్యామ్‌ సింగరాయ్‌ ఓటీటీ హక్కులను నెట్‌ ఫ్లిక్స్‌ సంస్థ కొనుగోలు చేసింది. ఈ మేరకు స్ట్రీమింగ్‌ డేట్‌ ను కూడా ప్రకటించింది. జనవరి 26 వ తేదీన ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ చేయడానికి నెట్‌ ఫ్లిక్స్‌ ప్లాన్‌ చేస్తుంది. ఇక ఈ సినిమా కు ప్రపంచ వ్యాప్తంగా.. రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement