Thursday, May 2, 2024

2023లో Space X మిషన్.. ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ని ఎంపిక చేసిన నాసా..

నాసా 2023లో ప్రయోగించే డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కు సంబంధించి బిగ్ అప్ డేట్ ని అందించింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కి స్పేస్‌ ఎక్స్ ద్వారా తన సిక్స్ క్రూ మెంబర్స్ ని రిక్రూట్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఇద్దరు ఆస్ట్రోనాట్స్ (వ్యోమగాములు)ని ఎంపిక చేసినట్టు గురువారం తెలిపింది. వీరిలో స్టీఫెన్ బోవెన్, ఉడీ హోబర్గ్ ఉన్నారు. వీరిద్దరూ 2023లో ప్రయోగించనున్న ఫాల్కన్ 9 రాకెట్‌ మిషన్‌కు అర్హత పొందారు. బోవెన్‌కు స్పేస్‌క్రాఫ్ట్ కమాండర్ గా వ్యవహరించనుంగా, హోబర్గ్ పైలట్‌గా వ్యవహరిస్తారు. అంతేకాకుండా ఈ మిషన్ కి మరో ఇద్దరు వ్యోమగాములను కూడా తీసుకుంటామని, వారు మిషన్ స్పెషలిస్ట్‌ గా వ్యవహరిస్తారని నాసా తెలిపింది.

కాగా, వీరిని రిక్రూట్ చేసుకునే తీదీలను త్వరలోనే ప్రకటిస్తామని నాసా తెలిపింది. అయితే.. ఈ మిషన్ ని ఫ్లోరిడాలోని నాసా కు సంబంధించిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభిస్తారు. ఈ నలుగురు సిబ్బంది లో ఎర్త్ ఆర్బిట్ లోని ఐఎస్ ఎస్ లో ఉన్న సిబ్బందితో చేరుతారు. కాగా, ఫ్లోటింగ్ స్పేస్ లాబరోరేటరీ అనేది దీర్ఘకాల అంతరిక్ష ప్రయాణ అడ్డంకులను అధిగమించడానికి, లో ఎర్త్ ఆర్బిట్ లో కమర్షియల్ గా విస్తరించడానికి ఉపయోగపడనుంది.

ఇప్పటికే ఏడు స్పేస్‌వాక్‌లలో 40 రోజులకు పైగా అంతరిక్షంలో ఉన్న బోవెన్‌కు ఇది నాలుగో పర్యటన. కాగా, క్రూ-6  ISSకి అతని మొదటి సుదీర్ఘ పర్యటన. బోవెన్ USలోని మసాచుసెట్స్ లోని కోహస్సెట్‌లో జన్మించాడు. అతను మేరీల్యాండ్‌లోని US నావల్ అకాడమీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. జులై 2000లో నాసా ద్వారా వ్యోమగామిగా ఎంపికైన మొదటి సబ్‌మెరైన్ అధికారిగా బోవెన్ వ్యవహరించాడు.

 2017లో నాసా ద్వారా వ్యోమగామిగా ఎంపికైన హోబర్గ్ కు, ఇది అంతరిక్షంలోకి వెళ్లే తొలి పర్యటన. అతను వ్యోమగామిగా ఎంపికైనప్పుడు హోబర్గ్ MITలో ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నాడు. వ్యోమగాములను వారి పరిశోధనలను నిర్వహించడానికి అంతరిక్షానికి రవాణా చేయడానికి NASAకి SpaceX విశ్వసనీయమైన ప్రైవేట్ భాగస్వామిగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement