Monday, May 6, 2024

Breaking: హైదరాబాద్ లో సెల్ఫీ సూసైడ్

ఇటీవల కాలంలో సెల్ఫీ సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. పలు సమస్యల కారణంగా సెల్ఫీ సూసైడ్ లకు పాల్పడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరంలో సెల్ఫీ సూసైడ్ చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకునేందుకు తమ ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదని ఓ యువకుడు సెల్ఫీ సూసైడ్ చేసుకున్నాడు. సాంబరాజు అనే యువకుడు ఓ హోటల్ లో రూమ్ రెంట్ కు తీసుకుని.. అందులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యువకుడి ఆత్మహత్య ఘటనపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement