Monday, April 29, 2024

LOVE JIHAD – ప్రేమికురాలి కళ్లు తెరిపించిన ది కేర‌ళ స్టోరీ…

ఇండోర్ – వివాద‌స్ప‌ద మూవీ ది కేర‌ళ స్టోరీ ప్రేమ మ‌త్తులో ఉన్న ఓ యువ‌తి క‌ళ్లు తెరిపించింది.. పెళ్లి చేసుకోవాలంటే మ‌తం మారాల్సిందేనంటూ కండిష‌న్ పెట్టిన ప్రియుడిపై ఏకంగా పోలీస్ కేసు పెట్టింది.. వివ‌రాల‌లోకి వెళితే మధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్‌ ఖజ్రానా పోలీసు స్టేషన్ ప్రాంతంలో ఓ ప్రేమ జంట నాలుగేళ్లుగా కలిసి ఉంటోంది. ఉన్నత చదువులు చదివిన యువతి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా యువకుడు మాత్రం 12వ తరగతి వరకే చదివాడు. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. తాజాగా ఈ ఇద్ద‌రు క‌ల‌సి ‘ది కేరళ స్టోరీ’ని చూసొచ్చారు. ఇంటికొచ్చాక సినిమా విషయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇది కాస్తా తారాస్థాయికి చేరుకోవడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, తనపై అత్యాచారం చేశాడంటూ బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టింది. ప్రస్తుతం అతనితో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. పెళ్లి కోసం తనని మతం మార్చుకోవాలంటూ మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు తో యువకుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు పోలీసు వెల్ల‌డించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement