Sunday, April 28, 2024

మార్చి 4న ‘సెబాస్టియ‌న్ పీసీ 524’ చిత్రం రిలీజ్

హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం తాజాగా సెబాస్టియ‌న్ పిసి 524 చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం మార్చి 4న రిలీజ్ కానుంది. జ్యోవిత సినిమాస్‌ పతాకంపై ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా ఈ చిత్రం తెరకెక్కింది. సెబాస్టియన్ చిత్రానికి సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌ నిర్మాతలు కాగా… బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ విడుదల చేస్తోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం’ చిత్రాల విజయంతో దూసుకుపోతున్న కిరణ్‌ అబ్బవరంకు ‘సెబాస్టియన్‌ పిసి524’ కచ్చితంగా హ్యాట్రిక్‌ హిట్‌ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జిబ్రాన్‌ సంగీతం దర్శకత్వంలో పాటలన్నీ అద్భుతంగా వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా “హెలి”అనే పాటకు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవలే విడుదలైన గ్లింప్స్ కూడా సూపర్ ట్రెండింగ్ లో ఉందని తెలిపారు. ఆదిత్యా మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఆడియోకు అద్భుతమైన స్పందన వస్తోందని వివరించారు.’సెబాస్టియన్ పీసీ 524′ రేచీకటి కాన్సెప్టుతో తెరకెక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement