Sunday, May 19, 2024

భూ ప‌రిర‌క్ష‌ణ ఉద్యమానికి క‌రేబియ‌న్ దేశాల మ‌ద్ద‌తు – ఇండియాతో ఒప్పందాలు

భూ ప‌రిర‌క్ష‌ణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఇషా ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్. ఈ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. మార్చి 21 నుండి ప్రారంభమయ్యే ‘సేవ్ సాయిల్’ ప్రచారంలో భాగంగా యూరప్, మధ్య ఆసియా, పశ్చిమాసియా మరియు భారతదేశం అంతటా సద్గురు 30,000 కి.మీ మోటార్ సైకిల్ రైడ్‌ను ప్రారంభించే ముందు కరేబియన్ దేశాల ప్రభుత్వాధినేతలు .. మంత్రులు ఈ ఎమ్ఒయుపై సంతకం చేశారు. 75 రోజుల ప్రయాణం, భారతదేశం@75 (భారత స్వాతంత్ర్యం 75 సంవత్సరాలు) ప్రతిబింబిస్తుంది. లండన్‌లో ప్రారంభమై జూన్ 4న న్యూఢిల్లీలో ముగుస్తుంది. 24 దేశాలను కవర్ చేస్తుంది. నేల తల్లిని కాపాడేందుకు ఆయన చేపట్టిన ఈ ఉద్యమానికి క‌రేబియ‌న్‌ దేశాలు మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే ప‌లు దేశాలు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 6 కరేబియన్ దేశాలు సద్గురు నేతృత్వంలోని నేలను రక్షించే ఉద్యమంలో చేరాయి. దీని కోసం ఆయ‌నతో క‌లిసి ముందుకు సాగ‌డానికి అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి. స‌ద్గురు జ‌గ్గీవాసుదేవ్ తో క‌లిసి నేల‌ను ప‌రిర‌క్షించే ఉద్య‌మంలో ఆరు క‌రేబియ‌న్ దేశాలు..

ఆంటిగ్వా అండ్ బార్బుడా, డొమినికా, సెయింట్ లూసియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, గయానా, బార్బడోస్ లు చేరాయి. ఆయా దేశాలు నాయ‌కులు స‌ద్గురుతో ప్రారంభించిన Save Soil Movement లో క‌లిసి ముందుకు సాగడానికి ఒప్పందంపై సంత‌కాలు చేశారు. మట్టి క్షీణతను తిప్పికొడుతూ.. నేల త‌ల్లి ర‌క్ష‌ణ‌కు కృషి చేస్తూ.. దీర్ఘకాలిక ఆహారాన్ని అందించడానికి తమ దేశాలలో ఖచ్చితమైన చర్యను ప్రారంభించాలని ఒప్పందం సంద‌ర్భంగా వారు ప్రతిజ్ఞ చేశారు. నెల ప‌రిర‌క్ష‌ణ‌, ఆహారం, ప్ర‌జ‌ల ఆరోగ్యం వంటి విష‌యాల‌ను ప్ర‌స్తావ‌స్తూ.. స‌ద్గురు Save Soil Movement ను ప్రారంభించారు. ఈ నెల 12న నాలుగు క‌రేబియ‌న్ దేశాలు నేల ప‌రిర‌క్ష‌ణ ఉద్యమంలో భాగం కావ‌డానికి స‌ద్గురుతో ఆయా దేశాల నాయకులు ఒప్పందం చేసుకున్నారు. వాటిలో ఆంటిగ్వా , బార్బుడా, డొమినికా, సెయింట్ లూసియా , సెయింట్ కిట్స్ , నెవిస్ లు ఉన్నాయి. నేల ఆరోగ్యం కోసం ప్రపంచం మ‌ద్ద‌తు తెలుతుపూ.. చ‌ర్య‌లు తీసుకోవ‌డం, నేలలను కనీసం 3-6% సేంద్రియ పదార్ధం ఉండేలా రక్షించడం, పెంపొందించడం మరియు నిలబెట్టుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా విధాన మార్పును నడపడం ఉద్యమం అనేది ఈ ఉద్య‌మం ప్ర‌ధాన ల‌క్ష్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement