Monday, May 13, 2024

సాఫ్‌ సీదా ముచ్చ‌ట‌.. వ‌డ్లు కొంట‌రా, కొన‌రా?.. మోడీకి కేసీఆర్ సూటి ప్ర‌శ్న‌

రైతుల‌కు వ్య‌తిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై తెలంగాణ సీెం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక‌టే మాట‌.. ఏం జ‌రుగుతోంది. ఏంది గ‌డ‌బిడ ఇది. లొల్లి ఏంది అస‌లు. ఒక‌టే ఒక మాట‌. సాఫ్‌ సీదా ముచ్చ‌ట‌. తెలంగాణ‌లో పండించే వ‌డ్లు కొంట‌రా? కొన‌రా? అది చెప్ప‌మంటే.. మేం మ‌రాఠీలో అడిగామా? ఉర్దూలో అడిగామా? అర్థం కాని భాషలో అడిగామా? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. ఇందిరా పార్క్ వ‌ద్ద టీఆర్ఎస్ చేప‌ట్టిన రైతు మ‌హాధ‌ర్నాలో కేసీఆర్ ప్ర‌సంగించారు.

బీజేపీ నాయ‌కులు వంక‌ర టింక‌ర మాట‌లు మాట్లాడుతున్నారు. ఈ గోస ఒక తెలంగాణ‌లోనే లేదు. యావత్ భార‌త‌దేశంలో ఉంది. ఒక ఏడాది కాలం నుంచి ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో వేల ల‌క్ష‌ల మంది రైతులు వ‌రుస నిరాహార ధీక్ష‌లు చేస్తున్నారు. పంట‌లు పండించే శ‌క్తి లేక కాదు. కేంద్రం తెచ్చిన చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం త‌న విధానాలు మార్చుకోకుండా అడ్డ‌గోలుగా మాట్లాడుతోంది అని కేసీ ఆర్ బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement