Sunday, May 5, 2024

Russia-Ukraine War: 3500 మంది ర‌ష్యా సైనికులు మృతి

గ‌త మూడు రోజులుగా ర‌ష్యా – ఉక్రెయిన్ వారి కొన‌సాగుతోంది. అయితే ఈ యుద్ధంలో రష్యాదే పై చేయిగా కనిపిస్తోంది. రష్యా చేస్తున్న దాడిని ఉక్రెయిన్ ఎదుర్కొంటోంది. అయితే ఉక్రెయిన్‌పై దాడికి దిగిన ర‌ష్యాకు కూడా భారీ న‌ష్టమే జ‌రిగినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 3500 మంది ర‌ష్యా సైనికులు చ‌నిపోయిన‌ట్లు ఉక్రెయిన్ ఆర్మీ త‌న ఫేస్‌బుక్ పేజీలో అప్‌డేట్ చేసింది. మ‌రో 200 మంది ర‌ష్యా సైనికుల్ని అరెస్టు చేసిన‌ట్లు చెప్పారు. దీనికి తోడు 14 విమానాల‌ను, 8 హెలికాప్ట‌ర్ల‌ను, 102 యుద్ధ ట్యాంక్‌ల‌ను కూడా ర‌ష్యా కోల్పోయిన‌ట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. అయితే ఈ స‌మాచారాన్ని ఎవ‌రూ ద్రువీక‌రించ‌లేదు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న దాడిలో మృతుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ష్యా వెల్ల‌డించ‌లేదు. ఉక్రెయిన్‌పై మిస్సైళ్ల వ‌ర్షం కురుస్తోంది. న‌ల్ల స‌ముద్రం నుంచి ర‌ష్యా త‌న క్షిప‌ణుల‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో వైమానిక దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement