Saturday, May 4, 2024

ఆర్ ఆర్ ఆర్ లోని ‘నాటు నాటు’ సాంగ్ కి 200మిలియ‌న్ వ్యూస్

ఆర్ ఆర్ ఆర్ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చర‌ణ్ న‌టిస్తున్నారు. కాగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది.కాగా ఈ మూవీ విడుదలకు ముందే పాటలు యూట్యూబ్‌ వ్యూస్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకు ఐదు భాషల్లో కలిపి 200 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ‘నాటు నాటు..’ లిరికల్‌ పాటను గతేడాది నవంబర్‌ 10న విడుదల చేశారు. గీత రచయిత చంద్రబోస్‌ రాసిన ఈ పాటను రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఆలపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement