Tuesday, May 7, 2024

ఇక ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్…

హైదరాబాద్, : డ్రైవింగ్‌ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్‌ లాంటి 15 రకాల చిన్నచిన్న సేవల కోసం రవాణా కార్యాలయాలలో గంటల కొద్దీ వేచి ఉండే విధానానికి త్వరలోనే విముక్తి లభించనుంది. లైన్లలో నిలబడలేని కొంత మంది తృణమో, ప్రణమో ఇచ్చుకుని బ్రోకర్లు, కార్యాల యాలలోని సిబ్బందితో తమ పనులు చేయించుకుంటున్నా రు. వీటన్నింటికీ స్వస్తి పలికి మెరు గైన విధంగా సేవలు అందించేందుకు కేంద్రం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేష న్‌, ఆర్‌సీలో పేరు మార్పు, మాటిగేజ్‌ను తొలగించు కోవడం, చిరునామా మార్చుకోవడం, అంతర్జా తీయ డ్రైవింగ్‌ లైసెన్సు పొందడం లాంటి వాటి 15 సేవల కోసం ఆధార్‌ నంబర్‌ నమోదు చేసుకుని ఇంటి నుంచే రవాణా శాఖ సేవలు పొందే లా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇందుకు అన్ని రాష్ట్రాల రవాణా శాఖలు కూడా సంసిద్ధత వ్యక్తం చేయ డంతో వీలైనంత తొందరగా ఆన్‌లైన్‌ సేవలు వినియోగ దారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ విధానం అమలులోకి వస్తే ఇంట్లో నుంచే రవాణా శాఖ పనులు పూర్తి చేసుకు నేందుకు వీలు కలుగుతుంది. వాస్తవానికి ఆర్టీఏ కార్యాలయాలలో ఇలాంటి వాటి కోసం వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. రవాణా శాఖ సిబ్బంది అందించే సేవలలో ఇలాంటి సేవలే రోజుకు 70 శాతం వరకు ఉంటున్నాయి. చిన్న చిన్న సేవలకు కూడా స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరి కావడంతో తప్పనిసరిగా కార్యాలయాలకు వెళ్ళి చేయించుకునే పనులకు ఒక్కోసారి స్లాట్‌లు లభించడం లేదు. ఇటు రవాణా కార్యాలయాలపై పనిభారం తగ్గించడం, అటు వినియోగదారులకు మేలైన విధంగా సేవలు అం దించేందుకు వీలుగా కేంద్రం ఈ విధానాన్ని అమ లులోకి తీసుకు రావాలని నిర్ణయించింది. విని యోగదారుడు 15 రకాలలో ఏ సేవల నైనా ఆన్‌లైన్‌లో పొందవచ్చు. అయితే సేవలు పొందే వ్యక్తి తప్పనిసరిగా తన ఆధా ర్‌ నంబరు నమోదు చేసుకోవాల్సి ఉంటుం ది. ఆధార్‌ వెరిఫికేషన్‌ అమలు వల్ల నకిలీ డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్న వారిని తొందరగా గుర్తించేందుకు వీలుంటుంది. ఇదే సమ యంలో వాహనదారులకు కూడా నాణ్యమైన సేవలు అందించేందుకు వీలవుతుంది. కార్యాల యాలపై పనిభారం తగ్గడంతో పాటు వినియో గదారుడికి సులభంగా సేవలు లభ్యమయ్యే అవకాశాలున్నాయి.
ఉద్యోగులు, వ్యాపారులు తదితరులు చిన్న చిన్న సేవలకు కొంత ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. 10 నిమిషాల పనికి రోజంతా కార్యాల యంలో కాపుకాయడం, తర్వాత ఏదో ఒక కొర్రీతో సిబ్బంది పని చేయలేమని చెప్పడంతో మరో రోజు కార్యాలయానికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కొత్త విధానం అమలులోకి వస్తే ఇటు వినియోగదా రులు, అటు రవాణా శాఖ సిబ్బందికి ఎంతో మేలు చేకూరుతుంది. ఆన్‌లైన్‌లోనే తమకు కావాల్సిన సేవలు పొందాలనుకుంటే అన్ని డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేస్తే సరిపో తుంది. ఏ సేవకు ఎం త సేపు పడుతుం ది, సంబంధిత డాక్టు మెంట్‌ ఎన్ని రోజుల్లో పొందవచ్చన్న వివ రాలన్నీ ఆన్‌లైన్‌లోనే రవాణా శాఖ అందిస్తోంది. డాక్యుమెంట్‌ అందేంత వరకూ ఆన్‌లైన్‌లో కార్యాలయం పంపించిన కాగి తా లను ట్రాఫిక్‌ అధికారులకు చూపిస్తే సరిపో తుంది. రవాణా శాఖ కార్యాలయాలలో బ్రోకర్లకు కూడా చెక్‌ పెట్టేందుకు వీలవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement