Saturday, April 27, 2024

రికార్డ్స్ మీద రికార్డ్స్ సృష్టిస్తోన్న ‘ఆర్ ఆర్ ఆర్’ ట్రైల‌ర్ !

స్టార్ డైరెక్ట‌ర్, స్టార్ యాక్ట‌ర్స్ , పాన్ ఇండియా మూవీ మ‌రి ఆ చిత్ర ట్రైల‌ర్ అంటే మాట‌లా. రికార్డుల మీద రికార్డ్స్ ని సృష్టిస్తోంది. ఆ చిత్ర‌మే ఆర్ ఆర్ ఆర్ . రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో భారీ ఎత్తున తెర‌కెక్కుతోందీ చిత్రం. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ , మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లు ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తోన్న ఈ చిత్ర ట్రైల‌ర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. కాగా యూట్యూబ్ లో సెన్సేషనల్ వ్యూస్ , లైక్స్ తో సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతుంది ఆర్ ఆర్ ఆర్ ట్రైల‌ర్.

టాలీవుడ్ చరిత్రలో ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న ట్రైలర్ గా సంచలనం సృష్టించింది. కేవలం 6 గంటల 15 నిమిషాల స‌మ‌యంలోనే 10 మిలియన్ వ్యూస్ అందుకుంది. ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ కేవలం 7 గంటల్లోనే టాలీవుడ్‌ ఫాస్టెస్ట్‌ 1 మిలియన్‌ లైక్డ్ ట్రైయిల‌ర్ గా ఆల్‌టైమ్‌ రికార్డును సాధించింది. ఇప్పుడు 20 మిలియన్‌ వ్యూస్‌కి దగ్గరగా దూసుకెళ్తుంది.మ‌రి ఈ చిత్రం ఇంకెన్ని రికార్డుల‌ను సృష్టించ‌నుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement