Thursday, May 16, 2024

Republic Day: చైనా బోర్డర్​లో జవాన్ల సంబురం.. –45 డిగ్రీల ఉష్ణోగ్రతలో రిపప్లిక్​ డే వేడుకలు..

73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ –45గా నమోదైన లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం , అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) జవాన్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.  1962లో స్థాపించిన ITBP భారతదేశం, -చైనా సరిహద్దులోని 3488 కి.మీ.ల రక్షణ కోసం మోహరించింది. దేశంలోని అత్యంత ఎత్తైన సరిహద్దు భద్రతలో ITBP పహారా కాస్తుంది. అందుకని దీనిని ‘హిమాలయాల సెంటినెల్స్’ అని పిలుస్తారు. హిమ్‌వీర్స్ (ITBP జవాన్లు) 12,000 నుండి 17,500 అడుగుల ఎత్తులో మోహరించారు. పర్వత సరిహద్దులలోని భూభాగంలో వాతావరణ పరిస్థితులు ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంటాయి.

అయినా ఈ ధైర్య సహాసాలు ప్రదర్శించే దేశ జవాన్లు హిమాలయ సరిహద్దులలో రెప్పపాటు కూడా కునుకు తీయకుండా నిరంతరం కఠినమైన నిఘా పెడతారు. కాగా, ITBPలోని  సిబ్బంది అందరూ ఎంతో కఠిన శిక్షణ పొందిన పర్వతారోహకులే. ITBP ఇటీవలే దేశానికి 59 సంవత్సరాల సేవను పూర్తి చేసింది. ఇది సంవత్సరాలుగా హిమాలయ ప్రాంతంలో విపత్తు పరిస్థితుల్లో ‘ఫస్ట్ రెస్పాండర్స్’గా వందలాది రెస్క్యూ ఆపరేషన్‌లను నిర్వహించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement