Tuesday, May 7, 2024

రీల్ తండ్రి కుమారైగా – రియ‌ల్ తండ్రికుమారై

శేఖ‌ర్ టైటిల్ తో యాంగ్రీ మ్యాన్ రాజ‌శేఖ‌ర్ హీరోగా ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. మ‌ల‌యాళం చిత్రం జోసెఫ్ కి రీమేక్ గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని ప‌ద్మ‌కుమార్ రూపొందిస్తున్నారు. కాగా ఈ మూవీలో జోజు జార్జ్ ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించాడు. ఓ న‌లుగు పోలీస్ ఆఫీస‌ర్స్ క‌థే ఈ శేఖ‌ర్. వీరంతా రిటైర్మెంట్ పోలీసులే. మలయాళంలో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అక్కడ ఈ సినిమాకి భారీ వసూళ్లతో పాటు ప్రశంసలు కూడా దక్కాయి. మలయాళంలో జోజు జార్జ్ పోషించిన పాత్రలో తెలుగులో రాజశేఖర్ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన కూతురు శివాని కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. తెరపై కూడా ఈ ఇద్దరూ తండ్రీకూతుళ్ల పాత్రల్లో కనిపించనుండటం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement