Saturday, April 27, 2024

Big Story | సిద్ధమైన ఏదుల రిజర్వాయర్‌.. అక్టోబర్‌ మొదటి వారంలో ప్రారంభం

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. నార్లాపూర్‌ జలాశయం నీటి విడుదలతో క్రమేణ నార్లాపూర్‌ రిజర్వాయర్‌ కు చేరుకున్న కష్ణా జలాలు త్వరలో ఏదుల పంపు హౌజ్‌ కు విడుదల చేయనున్నారు. కృష్ణా నదీజలాల బ్యాక్‌ వాటర్‌ నుంచి కొల్లాపూర్‌ గుట్టల్లోని కోతి గుండునుంచి నీటిని తోడే కార్యక్రమం విజయవంతంగా కొన సాగుతుండటంతో ఏదుల పంపుహౌజ్‌ కు నీటిని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు భూగర్భంలో నిర్మించిన భారీ పంపు హౌజ్‌ సముద్ర మట్టానికి భూతలం నుంచి 400మీటర్ల ఎత్తులో ఉండగా భూగర్భంలో 150 మీటర్ల లోతులో ఏర్పాటుచేసిన 10 భారీ మోటార్లలో ఒకమోటారు ను అక్టోబర్‌ మొదటి వారంలో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఈ మోటర్ల ప్రారంభానికి డిండీ 400 కేవీ విద్యుత్‌ కేంద్రం నుంచి విద్యుత్‌ సరఫరా చేసేందుకు సబ్‌ స్టేషన్ల నిర్మాణాలు పూర్తి చేశారు. హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ ను నూతనంగా నిర్మించారు. విద్యుత్‌ లైన్లు పూర్తి కావడంతో పాటుగా నార్లాపూర్‌ పంపుహౌజ్‌ నుంచి వార్లాపూర్‌ రిజర్వాయర్‌ కు ఇప్పటికీ సుమారు 2 టీఎంసీల నీటిని నిల్వ చేళారు. ఈనీటిని ఏదుదల పంపు హౌజ్‌ కు చేరగానే అక్కడినుంచి 900 మీటర్లలోతులోని సర్జి పూల్‌ కు నీటిని విడుదల చేస్తారు. అనంతరం ఆనీటినిఏదుల రిజర్వాయర్‌ కు విడుదల చేస్తారు ఆతర్వాత ఏదుల పంపులు ఆన్‌ చేసి నీటిని విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా అక్టోబర్‌ మొదటి వారంలోగా పూర్తి చేసేందుకు ఇంజనీర్లు సిద్ధం అవుతున్నారు. నార్లాపూర్‌ ప్రారంభంతో చరిత్ర సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం ఏదుల రిజర్వాయర్‌ తో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మరో కీలక ఘట్టానికి తెరతీసింది.

అయితే ఇప్పటికే పర్యావరణ, అడవీ, నీటి లభ్యత, నీటి కేటాయింపుల అనుమతులు పొందిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. 145 మెగావాట్ల 10 మోటార్లను భూగర్భ పంపు హౌజ్‌ లో నిర్మించడంతో పాటుగా భారీ పంపులను ఈ ప్రాజెక్టులో ఏర్పాటు చేయడం ఇంజనీరింగ్‌ అద్భుతంగా ఇప్పటికే గుర్తింపు లభించింది. ఆరుదశల్లో నీటిని ఎత్తిపోసే ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల దక్షిణ తెలంగాణకు వరప్రదాయినిగా మారనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 11 జూన్‌ 2015లోభూత్పూర్‌ లో శంకు స్థాపన చేసిన ఈ ప్రాజెక్టు పై స్థానిక నాయకులు, ఏపీ నాయకులు చేసిన ఫిర్యాదులతో న్యాయపోరాటం చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు సాధించింది. ఈ ప్రాజెక్టు లో భాగంగా నిర్మిస్తున్న జలాశయాలను డిసెంబర్‌ లోగా పూర్తి చేసి పంటకాలువల నిర్మాణాలను చేపట్టేందుకు నీటిపారుదల శాఖ రాత్రింభవళ్లు పనులు చేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే తరతరాలనుంచి పేదరికం అనుభవిస్తున్న మహబూబ్‌ నగర్‌ జిల్లాతో పాటుగా పూర్వ రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 16 నియోజక వర్గాల్లోని 12 లక్షల 38 వేల ఎకరాల భూమి సాగులోకి రానుంది. అలాగే 1226 గ్రామాలకు తాగునీరు శాశ్వతంగా అందించనుంది. ఏదుల రిజర్వాయర్‌ కట్ట పడవు 7.716 మీటర్లు కాగా పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 6.55 టీఎంసీలు కాగా నీటివినియోగానికి 5.91 టీఎంసీ కేటాయించారు.

- Advertisement -

చరిత్రలో నిలిచి పోతోంది.. చీఫ్‌ ఇంజనీర్‌ అహ్మద్‌ ఖాన్‌
ఆరుదశల్లో నీటిని ఎత్తిపోసే పాలమరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అనేక అద్భుతాలను ఆవిష్కరించనుందని ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ అహ్మద్‌ ఖాన్‌ చెప్పారు. ఏదుల రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి అయిందనీ, చిన్నపాటి మిగులు పనులు జరుగుతున్నాయని చెప్పారు. నార్లాపూర్‌ నుంచి ఏదుల రిజర్వాయర్‌ సర్జీపూల్‌ లో నీటిని నింపి పంపులు ప్రారంభించేందుకు దాదాపుగా పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. త్వరలో డ్రైయ్‌ రన్‌ పూర్తి చిెసి వెట్‌ రన్‌ కు సిద్ధం చేస్తున్నామన్నారు. సముద్రమట్టానికి 269 మీటర్ల ఎత్తులో ప్రారంభమై చివరికి నీటి ప్రవాహం చేరుకునే గమ్యానికి సముద్ర మట్టం నుంచి 735 మీటర్ల ఎత్తులో ఉంటుందని చెప్పారు.

దేశంలో 735 మీటర్ల ఎత్తులోకి నీటిని ఎత్తిపోసే భారీ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అని చెప్పారు. ఏదుల రిజర్వాయర్‌ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మరో అద్భుతమన్నారు. చుట్టూ విస్తరించిన కొండల మధ్యలో భూగర్భంలో నిర్మించిన భారీ పంపు హౌజ్‌ గా చరిత్రలో నిలవనుందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 5 లిఫ్ట్‌ లు 6 జలాశయాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ప్రాజెక్టులో చివరిదిగా లక్ష్మీ దేవి పల్లి జలాశయానికి 735 మీటర్ల ఎత్తులోకి నీటిని ఎత్తిపోయటం ప్రాజెక్టు చరిత్రలో అద్భుతమన్నారు. 5 ప్రాజెక్టులు ఆరు లిఫ్ట్‌ లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా నదీ బ్యాక్‌ వాటర్‌ నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున వర్షాకాలంలో 60 రోజుల పాటు 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టులు నింపనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement