Thursday, December 7, 2023

AP | ఏపీలో కొత్తగా ఎనిమిది కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు

అమరావతి,ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొత్తగా దేశవ్యాప్తంగా 87 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఈనెల 20న జరిగిన సమావేశంలో అనుమతినివ్వగా అందులో ఎనిమిది ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానున్నాయి. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లిలో, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మండలంలోని వలసపల్లె గ్రామంలో,

శ్రీ సత్యసాయి జిల్లాలోని గొరంట్ల మండలం పాలసముద్రంలో, పల్నాడు జిల్లాలోని మాచర్ల మండంలోని తాళ్లపల్లి గ్రామంలో, కృష్ణా జిల్లాలోని నందిగామలో, పల్నాడు జిల్లాలోని నర్సారావుపేట డివిజన్‌లోని రొంపిచర్లలో, కృష్ణా జిల్లాలోని నూజివీడులో, నంద్యాల జిల్లాలోని డోన్‌లో మొత్తం 8 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement