Sunday, April 28, 2024

TS | త్వరలో మరో 40 వేల డబుల్‌ ఇళ్ల పంపిణీ.. అర్హులందరికీ అందజేస్తాం: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: 9 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్ర రాజధాని నగరంలో 30 వేల డబుల్‌ బెడ్‌ రూము ఇళ్లను అర్హులైన పేదలకు అందించామని తెలిపారు. త్వరలోనే మరో 40 వేల డబుల్‌ బెడ్రూము ఇళ్లను పేదలకు అందజేయనున్నట్లు- పురపాలక శాఖ మంత్రి కేటీ-ఆర్‌ వెల్లడించారు. మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఫతుల్లగూడా- పీర్జాదీగూడ, ప్రతాప సింగారం, గౌరెల్లి, మంచిరేవుల, ఈసా నదిపై రెండు బ్రిడ్జిలకి రాష్ట్ర మంత్రి కేటీ-ఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీ-ఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ మహా నగరానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన నదిగా మూసీ నది ఉండేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో మూసీ నది మురికి కూపంగా మారిందన్నారు. మూసీ సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అక్టోబర్‌ చివరి నాటికి నీటి శుద్దీకరణ పనులు పూర్తవుతాయన్నారు. శాశ్వతంగా, దీర్ఘకాలికంగా ఉండేలా బ్రిడ్జిల నిర్మాణం చేపడుతామన్నారు.

మూసీ సుందరీకరణ
2000 మిలియన్‌ లీటర్స్‌ ఫర్‌ డే కెపాసిటీ-తో ఎస్టీపీల నిర్మాణం చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. దుర్గం చెరువు వద్ద 7 ఎంఎల్‌డీ కెపాసిటీ- ఎస్టీపీని నిర్మించాం. ఎస్టీపీలు పూర్తయితే మూసీలోకి పూర్తి స్థాయి శుద్ధి చేసిన నీటిని వదిలే పరిస్థితి ఉంటుందన్నారు. ”మంచిరేవుల – ఘట్‌కేసర్‌ వరకు మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించాలన్న సీఎం కలను నెరవేరుస్తాం. ఒక్కొక్కటిగా సీవరేజి ట్రీ-ట్‌మెంట్‌ ప్లాంట్‌లు పూర్తి చేసి బ్రిడ్జిలు కడుతున్నాం. 160 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌ చుట్టూ తిరగకుండా మధ్యలో మూసీ నది మీదుగా వెళ్లే విధంగా బ్రిడ్జిలు నిర్మిస్తాం. రూ.5 వేల కోట్లతో రెండో విడత ఎస్‌ఎన్‌డీపీ తొందరలోనే చేపడుతాం. జీవో 118లోని చిన్న చిన్న -టె-క్నికల్‌ సమస్యలను పరిష్కరిస్తాం” అని కేటీ-ఆర్‌ స్పష్టం చేశారు.

ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు.. అద్భుతంగా ఉండాలి
పైసలు ఎక్కువ ఖర్చయినా పర్వాలేదు బ్రిడ్జిలు ఆకర్షణీయంగా మూసీ పరివాహక ప్రాంతాలకు మరింత శోభ తెచ్చే విధంగా నిర్మించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడంతో పాటు- ఒకచోట నుంచి మరో చోటకు ఎలాంటి ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా ప్రయాణించేందుకు వీలుగా ఇప్పటికే అనేక ్లఫఓవర్లను అండర్‌ ఫాస్ట్‌లను అందుబాటు-లోకి తెచ్చామన్నారు. మరిన్ని అందుబాటు-లోకి తెచ్చేందుకు ఎస్‌ఆర్డీపీ రెండో దశ పనుల కోసం రూ.4 వేల కోట్లు మంజూరు చేస్తున్నట్లు- మంత్రి ప్రకటించారు. తమది చేతల ప్రభుత్వం అని తమకు ప్రజలు అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు.

- Advertisement -

నాటి ఇబ్బందులతో నేడు ముందుకు
2020లో వరదలు వచ్చినప్పుడు నగరంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని మంత్రి కేటీ-ఆర్‌ గుర్తు చేశారు. కరోనా కారణంగా కొన్ని పనులు చేయలేకపోయామని, ఇప్పుడు అన్నింటినీ పూర్తి చేస్తున్నట్లు- వెల్లడించారు. 100శాతం మురుగు నీటిని శుద్ధి చేయాలన్న సంకల్పంతో ఎస్టీపీలను నిర్మిస్తున్నట్లు- తెలిపారు. దుర్గం చెరువుపై నిర్మించిన వంతెన కంటే మరింత అందమైన వంతెనలను నిర్మించనున్నట్లు- చెప్పారు. గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతామన్నారు.

అగ్గిపెట్టెలో ఊసరవెల్లి చీర
అగ్గిపెట్టెలో ఇమిడే చీరను సోమవారం సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. నేత కళాకారుడు నల్ల విజయ్‌ తయారు చేసిన ఊసరవెల్లిలా రంగులు మార్చే చీరను చూసి కేటీఆర్‌ ఆశ్చర్యపోయారు. విజయ్‌ చేనేత కళను కేటీ-ఆర్‌ అభినందించారు. గతంలో విజయ్‌ సుగంధాలు వెదజల్లే చీరను తయారు చేశారు. సిరిసిల్ల నేత కళాకారుడు, అగ్గిపె-్టట-ల్లో ఇమిడే చీరను తయారు చేసిన దివంగత నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని కితాబునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement