Tuesday, May 7, 2024

నోట్ల క‌ట్ట‌లు – డ్ర‌గ్ ఇన్ స్పెక్ట‌ర్ ఇంట్లో భారీ న‌గ‌దు

ఓ డ్ర‌గ్ ఇన్ స్పెక్ట‌ర్ ఇంటిపై దాడి చేశారు విజిలెన్స్ విభాగం అధికారులు. ఈ దాడుల్లో రూ.3కోట్ల న‌గ‌దుతో పాటు బంగారం..వెండి,ల‌గ్జ‌రీ వాహ‌నాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.ఈ సంఘ‌ట‌న బీహార్ లోని పాట్నాలో చోటు చేసుకుంది. అక్రమాస్తుల కేసులో బీహార్‌కు చెందిన ఓ డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నివాసంపై విజిలెన్స్‌ విభాగం అధికారులు దాడులు చేశారు. పాట్నా సహా నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్ర‌మంలో బంగారం, వెండి, విలువైన పత్రాలతో పాటు దాదాపు రూ. 3 కోట్ల న‌గదును స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బును లెక్కించేందుకు అధికారులు చెమలుక‌క్కారు. క‌రెన్సీ కట్టలన్నింటీనీ బెడ్డుపై పోసి..గంటల కొద్దీ లెక్కపెట్టారు.

రాష్ట్ర విజిలెన్స్, ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అధికారి నివాసం, కార్యాలయంలో జ‌రిపిన దాడుల్లో రూ. 3 కోట్లకు పైగా నగదు, కిలో బంగారం, వెండి ఆభరణాలు, ఐదు లగ్జరీ వాహనాలు, బినామీ ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రోజంతా దాడులు నిర్వహించింది. 2011 నుంచి విధుల్లో చేరిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ జితేంద్రకుమార్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. జెహానాబాద్‌లోని ఘోన్సీలోని అతని ఇల్లు, గయా పట్టణంలోని ఫ్లాట్‌లు, దానాపూర్‌లోని అతని ఫార్మసీ కళాశాల, పాట్నా సిటీలో కొత్తగా నిర్మించిన ఇంటిపై దాడి చేసినట్లు VIB అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయ‌న‌ పాట్నాలో ఉద్యోగం చేస్తూ.. మ‌రోవైపు ఫార్మసీ కళాశాలను కూడా నడుపుతుండ‌టం విశేషం. నోట్ల క‌ట్ట‌లు చూసి అధికారులే ఖంగు తిన్నార‌ట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement