Saturday, April 27, 2024

Box Office: సంక్రాంతి బరిలో ఆ రెండే.. థియేటర్లలో సందడే సందడి

టాలీవుడ్ కి సంక్రాంతి పెద్ద సీజ‌న్‌. పండగ సెలవుల్లో ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు ఇష్ట పడతారు. దీంతో నిర్మాతలు సంక్రాంతికి పెద్ద సినిమాలను బరిలో దింపుతుంటారు. ముందే అప్ర‌మ‌త్త‌మై రిలీజ్ డేట్లు ప్ర‌క‌టించుకుంటారు. సినిమా రిలీజ్ కు 3,4 నెలల ముందే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు. ప్రస్తుతం క‌రోనా వ‌ల్ల ప‌రిస్థితుల్ల‌న్నీ త‌ల్ల‌కిందులైపోయాయి. థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతాయా? లేదా? అన్న పరిస్థితి నెలకొంది. అయితే, కరోనా ప్రభావం తగ్గడంతో అఖండ, పుష్పలాంటి సినిమాలు రిలీజ్ అయ్యి.. టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త ఊపీరినిచ్చాయి.

సంక్రాంతి పెద్ద పండ‌గ‌ కాబ‌ట్టి.. మూడు సినిమాల వ‌ర‌కూ ఛాన్స్ ఉంటుంది. దీంతో కొత్త ఏడాదిలో థియేటర్లు సందడిగా మారనున్నాయి. ఈసారి సంక్రాంతికి కూడా భారీ చిత్రలే బరిలో ఉన్నాయి. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ తదితర చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ లో ఉన్నాయి. అయితే, తాజాగా భీమ్లా నాయక్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది.

భారీ చిత్రల విడుదల నేపథ్యంలో నిర్మాతలు దిల్ రాజు, యూవీ వంశీ, డీవీవీ దానయ్య ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. “సంక్రాంతికి ‘ఆర్ ఆర్ ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలను రిలీజ్ చేయాలని నిర్మాతలు అనుకున్నారని తెలిపారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలను మొదలుపెట్టేసి మూడేళ్లు అయిందని చెప్పారు. ఆ రెండూ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడంతో తెలుగుతో పాటు అదే రోజున అవి హిందీలో కూడా రిలీజ్ అవుతున్నాయని చెప్పారు.

ఈ రెండు సినిమాలకి కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో థియేటర్లు అవసరం ఉందన్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న థియేటర్లను మూడు సినిమాలకు కేటాయించే పరిస్థితి లేదన్నారు. ఈ విషయంపై పవన్ తోను ‘భీమ్లా నాయక్’ నిర్మాతతోను మాట్లాడినట్లు తెలిపారు. అందుకు వారు సానుకూలంగా స్పందించడంతో ‘భీమ్లా నాయక్’ ను ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేసినట్లు వెల్లడించారు. అయితే, అదే రోజున మా ‘ఎఫ్ 3’ రావలసి ఉందని తెలిపారు. ‘ఎఫ్ 3’ ను రిలీజ్ ను ఏప్రిల్ 29కి మార్చినట్లు దిల్ రాజు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement