Tuesday, April 30, 2024

‘ఆర్ ఆర్ ఆర్’ ప్ర‌మోష‌న్స్ – ఎప్పుడు..ఎక్క‌డంటే

స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రంలో స్టార్ హీరోస్ రామ్ చరణ్, ఎన్టీఆర్ న‌టించారు. కాగా బాలీవుడ్ న‌టులు అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ నటించారు. మార్చి 25న ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ నెల 18 నుంచి చిత్ర ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోనే కాదు, విదేశీ గడ్డపైనా ప్రమోషనల్ ఈవెంట్లు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు వెల్లడించింది. మార్చి 18- హైదరాబాద్, మార్చి 18- దుబాయ్,మార్చి 19- బెంగళూరు,మార్చి 20- బరోడా,మార్చి 20- ఢిల్లీ,మార్చి 21- అమృత్ సర్,మార్చి 21- జైపూర్,మార్చి 22- కోల్ కతా,మార్చి 22- వారణాసి.

Advertisement

తాజా వార్తలు

Advertisement