Saturday, April 27, 2024

పుష్ప రిలీజ్ వాయిదా : ఎక్క‌డంటే

పుష్ప పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. సుకుమార్ ద‌ర్శ‌కుడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం రేపు అంటే డిసెంబ‌ర్ 17న రిలీజ్ అని ఎనౌన్స్ కూడా చేశారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం రిలీజ్ వాయిదా ప‌డింది. ఇంకా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తికాలేద‌ని , ఈ సినిమాని వాయిదా వేస్తున్నామ‌ని చెప్ప‌డంతో బ‌న్నీ ఫ్యాన్స్ అవాక్క‌య్యారు. అయితే ఈ చిత్రం ఈ నెల 23న విడుద‌ల చేశారు. కాగా ఇదంతా ఇక్క‌డ కాదు లెండి. సింగపూర్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో పుష్ప సినిమాను ఈ నెల 23వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు.

ఇక మిగిలిన దేశాలలో మాత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందని ప్రకటించారు. దీంతో సింగపూర్ లో ఉన్న బన్నీ అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయారు. బన్నీ కెరీర్ లో తొలిసారి భారీ పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న పుష్ప రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు. తమిళనాడు – కేరళ – కర్ణాటక తో పాటు హిందీ లో కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని కలలు కంటున్న బన్నీ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. ఈ చిత్రంలో అన‌సూయ‌,సునీల్ కీల‌క‌పాత్ర‌లు పోషించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement