Wednesday, May 15, 2024

Punjab Elections: పంజాబ్ లో మొదలైన పోలింగ్..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అన్ని స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. పంజాబ్‌లో 117 స్థానాలకు ఎన్నికలు ఒకే విడతలో జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 93 మంది మహిళలు సహా 1,304 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.14 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్, బీజేపీ, అప్ తదితర పార్టీల మధ్యే ప్రధాన పోటీ జరుగుతోంది. పంజాబ్ కేంద్రంగా సాగిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలు తమకు కలసి వస్తాయని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భావిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత పోరు తమకు కలిసి వస్తుందని ఇతర పార్టీలు భావిస్తున్నాయి.

కాగా, 2017లో పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లను కైవసం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ 20, ఎస్‌‌ఏ‌డీ, ‌బీ‌జే‌పీకి కేవలం 18 సీట్లు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement