Sunday, May 5, 2024

భార‌త్ లో ఐదు రోజులు ప‌ర్య‌టించ‌నున్న – ఇజ్రాయోల్ ప్ర‌ధాన మంత్రి

భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆహ్వానం మేర‌కు ఇజ్రాయోల్ ప్ర‌ధాన మంత్రి న‌ప్తాలి బెన్నెట్ ఏప్రిల్ 2న ఇండియాలో ప‌ర్య‌టించ‌నున్నారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపన 30 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ మొదటి వారంలో తాను భారతదేశాన్ని సందర్శిస్తానని చెప్పారు.ఈ పర్యటనలో భాగంగా భారత్-ఇజ్రాయిల్ రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముంది. నూతన ఆవిష్కరణ , సాంకేతికత, భద్రత, సైబర్ వ్యవహారాలు, వ్యవసాయం మరియు వాతావరణ మార్పు రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించడం కూడా ఈ పర్యటన లక్ష్యంగా ఉందని నఫ్తాలి వెల్లడించినట్టు ఇజ్రాయిల్ మీడియా పేర్కొంది. గత అక్టోబర్‌లో గ్లాస్గోలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు (COP26) సందర్భంగా ఇరువురు నేతలు తొలిసారిగా కలుసుకున్నారని, ప్రధాని మోడీ అధికారిక పర్యటనకు రావాల్సిందిగా ప్రధాని బెన్నెట్‌ను ఆహ్వానించారని సదరు ప్రకటన పేర్కొంది. ఈ పర్యటన దేశాలు , నాయకుల మధ్య ముఖ్యమైన సంబంధాన్ని పునరుద్ఘాటిస్తుంది .. ఇజ్రాయెల్ మరియు భారతదేశం మధ్య సత్సంబంధాల స్థాపన 30వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది” అని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement