Friday, May 24, 2024

రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌ధాని మోడీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్న కొత్త సంవ‌త్స‌రం కానుక‌గా గుడ్ న్యూస్ చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా.. అంటే జనవరి 1వ తేదీన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులను రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్న‌ట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇప్పటి వరకు తొమ్మిది విడతల్లో.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను విడుదల చేసినట్లు, జనవరి 1వ తేదీ నుంచి పదో విడత డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతోనే ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. కాగా ఈ పథకం కింద కేంద్రం ఏటా రైతుల ఖాతాల్లో మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు జమ చేస్తోంది. దీనివల్ల దేశ వ్యాప్తంగా 12కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఇక ఈ పథకం డబ్బులను https://pmkishan.gov.in/ వెబ్ సైట్ ద్వారా చూసుకోవచ్చని కేంద్రం తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement