Thursday, May 9, 2024

ఇండియాకి ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ .. ప‌ర్య‌ట‌న వివ‌రాలు ఇవే ..

భార‌త్ రానున్నారు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకి రానున్నారు. ఈ మేర‌కు భారత్ , ర‌ష్యాల మ‌ధ్య 21వ వార్షిక ద్వైపాక్షిక స‌ద‌స్సు ఢిల్లీలో జ‌ర‌గ‌నుంది. భార‌త ప్ర‌ధాని మోడీ, ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ స‌మావేశం సోమ‌వారం జ‌ర‌గ‌నుంది. కాగా నేడు ఆదివారం రాత్రి ఆ దేశ విదేశాంగ‌మంత్రి సెర్జీలావ‌రోవ్ , ఆ దేశ మంత్రి సెర్జి షోయ్ గులు భార‌త్ కి రానున్నారు. ఇరు దేశాల మ‌ధ్య ప‌ది కీల‌క ఒప్పందాల‌పై సంత‌కాలు పెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం.. ఈ మేర‌కు రష్య‌న్ ప్రెసిడెన్షియ‌ల్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ పర్యటనలో ఆ దేశా విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రితోపాటు రోస్నెఫ్ట్ సీఈవో ఇగోర్ సెచిన్, ఉషకోవ్‌లూ ఉంటారని సమాచారం.

కాగా ఇందులో కొన్ని పాక్షిక రహస్య విషయాలూ ఉన్నాయని, మరికొన్నింటిపై ఇంకా కసరత్తులు జరుగుతున్నాయన్నారు. అందుకోసమే ఆ ఒప్పంద వివరాలను పూర్తిగా ఇప్పుడే బహిర్గతం చేయలేమ‌న్నారు. అయితే, ఈ ఒప్పందాలతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత ధృడంగా మారుతాయని తెలిపారు. ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు పర్యటించే బృంద సభ్యుల సంఖ్యను తగ్గించినట్టు స‌మాచారం. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య సమావేశం ప్రారంభం అవుతుంది.

అనంతరం, సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వ్లాదిమిర్ పుతిని తిరిగి రష్యా వెళ్లిపోనున్నారు. కరోనాతో అల్లాడుతున్న సమయంలో భారత్‌కు సహాయం చేయడంపై చిరకాల మిత్ర దేశం రష్యా సానుకూలంగా వ్యవహరించింది. భారత్‌కు మెడికల్ ఆక్సిజన్, రెమ్‌డిసివర్‌ రెండింటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. వచ్చే 15 రోజుల్లోనే వాటిని భారత్‌కు పంపాలని మాస్కో నిర్ణయించినట్టు సమాచారం. వారానికి 3,00,000-4,00,000 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, అలాగే నౌక ద్వారా మెడికల్ ఆక్సిజన్‌ను పంపేందుకు రష్యా ముందుకొచ్చినట్టు జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. మ‌రి మ‌రిన్ని ఒప్పందాలు జ‌రిగితే ఈ రెండు దేశాల మ‌ధ్య బంధం మ‌రింత ప‌టిష్టంగా మార‌నుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement